జేసీ అరెస్టుకు టీడీపీ కొత్త కార్డు తీసిందిగా!

-

మంచి చేయడం కూడా చెడైపోయిన రోజులివి! అవినీతిని రూపుమాపుతానని, ప్రజలడబ్బు అవినీతిపాలు కాకుండ చూస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్… తాను అనుకున్న పని తాను చేసుకుంటూ పోతున్నారు. ముందు ప్రజల సంక్షేమంపైనా, అనంతరం రాష్ట్రాభివృద్ధిపైనా దృష్టి పెట్టిన ఆయన.. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఉక్కుపాదం మోప నిర్ణయించారు. ఇందులో భాగంగా సీబీఐ ఎంక్వైరీలు, ఏసీబీ అరెస్టులు! ఇది కొంతమందికి చాలా చేదుగా ఉంటుంది!

అవినీతి చేసిన, అక్రమాలు చేసిన వ్యక్తులను (వాళ్లు ఎవరైనా కావొచ్చు) అరెస్టు చేస్తుంటే వక్ర బాష్యాలు తీసున్నారు కొందరు పెద్దమనుషులు అనబడేవారు! చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కాను, ఏపీ ఫైబర్ గ్రిడ్ పై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు సీబీఐ ఎంక్వైరీ వేస్తే… దాన్ని కక్ష పూరిత చర్యలుగా చెబుతుంటారు. తప్పు చేసినవాడు కదా భయపడాలి… నిప్పులకు ఏమి భయం.. నిప్పులు తుప్పు పట్టదుగా! ఆ లాజిక్ ప్రజల విజ్ఞతకే వదిలేస్తుంటారు సదరు నాయకులు! అనంతరం అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే… బీసీ లను అణగదొక్కే చర్యల్లో భాగం అంటారు… అది కాస్త సరిగా పనిచేయకపోయేసరికి… అసెంబ్లీలో అచ్చెన్నాకు భయపడ్డారు అంటారు! అచ్చెన్నాయుడు తప్ప అసెంబ్లీలో మాట్లాడే మగాడే టీడీపీ కి లేడా? అనే ప్రశ్నకు… సమాధానం రాదు!

ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదవగా.. ఇన్నాళ్లకి అరెస్టు చేస్తే.. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరమీదకు తెస్తున్నారని అంటారు! రాయలసీమలో ఎవరు ఎంత అవినీతి చేసినా, ఎవరు ఎంత దుర్మార్గాలు చేసినా, ఎవరు ఎంత అక్రమాలు చేసినా.. వారు గనుక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు రాజకీయ ప్రత్యర్ధులు అయితే… వారిని వదిలేయాలా? లేకపోతే… అది ఫ్యాక్షనిజాన్ని పెంచడమో, మళ్లీ మొదలెట్టడమో అవుతుందా?

Read more RELATED
Recommended to you

Latest news