కేసీఆర్‌ ను షర్మిల తిడుతోంది..నువ్వు జగన్‌ ను తిట్టు – కేటీఆర్‌ కు జేసీ సలహా

-

సీఎం కేసీఆర్‌ ను షర్మిల తిడుతోంది..నువ్వు జగన్‌ ను తిట్టు అని కేటీఆర్‌ కు జేసీ ప్రభాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. కేటీఆర్ ఎంత కథ చెప్పి స్లిప్ ఆఫ్ ది టంగ్ అని ఎందుకు అన్నావని.. షర్మిలమ్మ రోజు మీ నాయనను, ప్రభుత్వాన్ని తిడుతోంది అది మనసులో పెట్టుకొని తిట్టావని ఎద్దేవా చేశారు. దానికి కట్టుబడి ఉండు… నేను నీకు సపోర్టు చేస్తా… నిన్ను ఎవరు ఏమి చేయరని భరోసా ఇచ్చారు.

తల్లి సరిగా పెంచలేదని రేప్ కేసు నిందితులపై హోం మంత్రి కామెంట్ చేసిందని.. జగన్ ను మా రాజశేఖర్ రెడ్డి సరిగా పెంచాలని చూశారని పేర్కొన్నారు. తల్లి కరెక్టుగానే పెంచింది… అంతలోనే తాత దగ్గర చేరాడని.. అందుకే అచ్చం రాజారెడ్డి లాగా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ప్రబోధానంద కేసు 2018 లో జరిగితే నేటికీ అరెస్టులు చేస్తున్నారని… 150 మంది గొడవలో ఉంటే 200మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇప్పటికీ చార్జిషీట్ వేయలేదు… తాజాగా 46 పేర్లు కొత్తగా చేర్చారని తెలిపారు. అందులో 36 మంది ముస్లింలు ఉన్నారు… వారంతా అమాయకులు అన్నారు జేసీ.

Read more RELATED
Recommended to you

Latest news