కేసులు పెడితే భయపడం..ఫ్రాంక్ వీడియోలు చేస్తే తప్పేంటి ? అని టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ అన్నారు. నిన్న విశ్వక్ సేన్ టీం చేసిన ఫ్రాంక్ వీడియోపై కేసు నమోదు అయింది. అయితే.. దీనిపై హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ….. సినిమా ప్రమోషన్ లో భాగంగా.. మా మూవీ టీం నా పై ప్రాంక్ ప్లాన్ చేశారన్నారు.
ఫస్ట్ కంగారు పడ్డాను కానీ.. ప్రాంక్ అని గమనించాను.. నేను కూడా ఎంజాయ్ చేసానని వెల్లడించారు హీరో విశ్వక్ సేన్ . డబ్బాలో ఉన్నది పెట్రోల్ కాదు.. వాటర్. అక్కడ పబ్లిక్ కి న్యూసెన్స్ క్రియేట్ చేసేలా మేము వ్యవహరించలేదని స్పష్టం చేశారు.
అక్కడ ఉన్నదంతా మా టీం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సరదాగా తీసుకున్నారన్నారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. సినిమా లో అవకాశాలు పొందుతున్న వాళ్లు కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రాంక్ వీడియో లు చేసే వాళ్ళందరిపై.. కేసులు పెడతా అని లాయర్ అనడం కరెక్ట్ కాదని మండిపడ్డారు హీరో విశ్వక్ సేన్.