విద్యార్థులకు అలర్డ్‌.. నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌-2

-

నేటి నుంచి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తుది విడత పరీక్షను నిర్వహిస్తున్నారు ఎన్డీఏ అధికారులు. ఐఐటీ, ఎన్ఐటీతో పాటు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష ఉంటుంద ఎన్డీఏ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించమని పేర్కొన్నారు అధికారులు. ఇదిలా ఉంటే గతేడాది జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించగా ఈ ఏడాది రెండు ఫేజ్ ల్లోనే నిర్వహిస్తున్నారు అధికారులు. నేడు జరిగే పరీక్షకు దేశ్యాప్తంగా మొత్తం 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నారు.

JEE Mains 2022: NTA to announce exam dates soon, check application process,  paper pattern and more

ఇక ఈ ఏడాది పరీక్ష విధానాన్ని పూర్తిగా మార్చారు. గతంలో కేవలం సెక్షన్-ఏలో మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. సెక్షన్-బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. కరోనాతో 2021-22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు అందించనున్నారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ కు సంబంధించిన ప్రక్రియను ఆగస్టు రెండో వారంలో మొదలవ్వనుంది. ఆగస్టు 28న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది ఎన్టీఏ.

 

 

Read more RELATED
Recommended to you

Latest news