జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది..అయితే వాయిదా పడిన ఈ ఎగ్జామ్స్ ను ఈ నెల 21 నుంచి 30 జరిపేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలను చేపట్టనున్నట్లు తెలుస్తుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు జులై 21 నుంచి కాకుండా.. జులై 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే.. CUET Exam 2022 జులై 20 వరకు జరుగనున్నాయి. వెంటనే జులై 21 నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ప్రారంభమైతే.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జులై 25 నుంచి జేఈఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 2 పరీక్షలకు 6,29,778 మంది విద్యార్థులు హాజరుకానున్నారు..
కాగా, దీనికి సంభంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే అడ్మిట్ కార్డులు గురువారం విడుదల చేయనున్నారు..ఈ అడ్మిట్ కార్దులను డౌన్‌లోడ్ చేసేందుకు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ చూస్తూ ఉండాలి…