బరువు తగ్గాలనుకునే వారికి గోరుచిక్కుడు కాయ మంచిదేనా..?

-

బరువు తగ్గాలనుకునే వారికి గోరు చిక్కుడు కాయ బాగా మేల చేస్తుందట. ఇందులో ఉన్న పోషకాలు బరువును అదుపులో ఉంచుతాయని వైద్యులు అంటున్నారు. కేలరీలు తక్కువ, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ. గోరు చిక్కుడు వల్ల గుండె ఆరోగ్యం కూడా అదుపులో ఉంటుంది. చాలామందికి గోరుచిక్కుడు అంటే ఇష్ట ఉండకపోవచ్చు..కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే ఇక వదిలిపెట్టరు కూడా.!

గోరు చిక్కుడులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్‏గానూ తీసుకోవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పొట్ట శుభ్రమవుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా గోరుచిక్కుడు మంచి ఆహారం.

రక్తహీనత..

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ ఉన్నవారు వారానిరికి రెండు సార్లు గోరు చిక్కుడుని తీసుకుంటే రక్తం వృద్ధి చెందుతుంది. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణం దీనికి ఉంటుంది. గోరు చిక్కుడులోని హైపోగ్లైసియామిక్‌ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మధుమేహంతో బాధపడే వారికి గోరు చిక్కుడు వంటలు ఉపయోగకరం. రక్తంలో చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది.

గర్భిణీలకు ఇంకా ఉత్తమం..

గర్భిణీలకు గోరుచిక్కడు కాయ మంచి ఆహారం. పిండం సాధారణ అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. గోరుచిక్కుడు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ చంపుతుంది. ఫ్రీరాడికల్స్‌ ఎక్కువ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఫైబర్‌ను కలిగి ఉంటుంది. గోరుచిక్కుడు కాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయ పడుతుంది. గోరుచిక్కుడును ఆహారంగా తీసుకుంటే కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది

Read more RELATED
Recommended to you

Latest news