రేషన్ షాపుల్లో మోడీ బొమ్మలు కాదు..GST బొమ్మలు పెట్టాలని చురకలు అంటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు పోటీ పడుతున్నాయని నిప్పులు చెరిగారు. మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల పంచాయితీ మాత్రమే కానీ అభివృద్ధి కనిపించడం లేదని తెలిపారు.
రేషన్ షాపుల్లో నేతల బొమ్మలు కాదు…పెడితే జిఎస్టీ బొమ్మ పెట్టాలని.. 8 ఏళ్లలో జిఎస్టీ ద్వారా ప్రజలపై 3లక్షల కోట్ల భారం పడిందని మండిపడ్డారు. జిఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్ప ప్రయోజనం లేదని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నువ్వంటే నువ్వని కొట్లాడుతున్నాయని తెలిపారు. రైతుబంధు సాకుతో ప్రజలకు అందాల్సిన ప్రయోజనలాంటిని ఆపేశారని.. 2014 కు ముందు ఉన్న వాటిని నిలిపివేసి పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహించారు.