“ఆ లైన్” చెప్పి చెర్రీ ని ఫ్లాట్ చేసిన జెర్సీ దర్శకుడు !

-

ఇండస్ట్రీలో వరుస ప్లాపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేచురల్ స్టార్ నాని కి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గౌతమ్ తిన్ననూరి తీసిన మొదటి సినిమా ‘మళ్లీరావా’ మంచి పేరు తెచ్చుకుంది. ఇక రెండో సినిమాతోనే ఇండస్ట్రీలో అదిరిపోయే హిట్ అందుకోవడంతో స్టార్ హీరోల అందరి దృష్టి గౌతమ్‌పై పడింది.

Image result for ram charan jersey director

ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. ఇప్పటికే  చరణ్ కి దాదాపు మూడు స్టోరీలు చెప్పాడని టాక్. రెండు కథలు అంతగా నచ్చలేదట .. కానీ మూడో కథ బాగా ఎగ్జయిట్‌ చేసిందని సమాచారం. ఆ కథను డెవలప్‌ చేయాలనీ చెప్పాడట. ఈ మూడో కథలో హీరో మాస్‌ ఎలివేషన్‌ అదిరిపోయే రీతిలో ఉండటంతో ” ఆ లైన్ ”  కి రామ్ చరణ్ ఫ్లాట్ అయిపోయాడట…దీంతో ఈ సినిమా స్టోరీ డెవలప్ చేసే పనిలో గౌతమ్ నిమగ్నమైనట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే గౌతమ్  స్టోరీ ఓకే అయితే సినిమా స్టార్ట్ చేయాలనే ఆలోచనలో చరణ్‌ ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news