నిత్యం మీడియాలో ఉంటూ.. జగన్ ప్రబుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించే టీడీపీ అధినేత చంద్ర బాబులో ఇటీవల కాలంలో కనిపించని మార్పు కనిపిస్తోంది. నిజానికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబా బు వ్యూహం తలకిందులై.. ఆయన ప్రతిపక్షానికి పరిమితయ్యారు. దీంతో కొంత హర్ట్ అయినా.. ఆ వెంటనే అతి తక్కువ కాలంలో ఆయన తేరుకున్నారు. జగన్ ప్రభుత్వంపైనా, జగన్‌పైనా ఆయన విమర్శల బాణాల ను ఎక్కు పెట్టారు. ఇక, పార్టీ ని సైతం ఆయన పుంజుకునేలా చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తు న్నారు. ఎక్కడికక్కడ కొత్త ఇంచార్జులను నియమిస్తున్నారు. పాతవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇక, మరీ ముఖ్యంగా రాజధాని అమరావతిని ప్రముఖంగా తీసుకున్న చంద్రబాబు దీనిని ఎలాగైనా నిలబె ట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇక, పార్టీలో తలకోరకంగా మారిన తమ్ముళ్లను కూడా లైన్‌లో పెట్టుకునేందుకు వేయని ఎత్తుగడ కూడా లేదు. అయితే, ఈ ఆలోచనలు, వ్యూహాలు ఫలించినట్టే ఫలించి ఇట్టే ఫెయిలవుతుండడంతో బాబులో ఉత్తేజం తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల కేంద్రం అమరావతి విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కు జగన్‌కు అన్ని విధాలా సహకరిస్తామని ప్రకటించడం వంటివి బాబులో ఆందోళనను మరింత తీవ్రత రం చేశాయి.
అదే సమయంలో పార్టీ పరిస్థితి కూడా ఆయనను వేధిస్తోందట. పైకితాను ధైర్యంగానే ఉన్నా.. తన తర్వాత పార్టీని లీడ్ చేసేది ఎవరు? తన కుమారుడు లోకేష్ రేపు మండలి రద్దయితే.. పూర్తిగా పదవిని సైతం కోల్పోతాడు. ఇక, పార్టీ పరిస్థితి ఎలా? ఎవరు నడుపుతారు? ఇప్పుడున్న సమస్యలు, విభేదాలు.. వంటివి ఎప్పటికి కొలిక్కి వస్తాయి? అనే చింత బాబును పట్టుకుందని అంటున్నారు. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చంద్రబాబును మరింత భయపెడుతున్నాయి.
గత ఏడాది జరిగిన పరాభవమే ఇప్పుడు స్తానికంలోనూ ఎదురైతే.. పార్టీ ఉనికికే ప్రమాదం అనేకోణంలో ఆయన ఆలోచిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు మాత్రం బాబు మాటలను విన్నట్టే వింటూ.. పెడచెవిన పెడుతున్నారు. ఈ పరిణామాలతో చంద్రబాబు గడిచిన వారం రోజులుగా అంతర్మథనంలో మునిగిపోయారని,మానసికంగా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.