ఈనెల 5వ ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

-

ఈనెల 5వ ఝార్ఖండ్​ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్​ అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్వాస పరీక్ష పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ కొనసాగటంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో జేఎంఎం ప్రతినిధి బృందం.. గవర్నర్‌ రమేశ్ బైస్‌ను కలిసింది.

సీఎం సోరెన్‌ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు పడనుందని రాజ్‌భవన్‌ నుంచి లీక్‌లు రావటం వల్ల పాలనా యంత్రాంగంలో అనిశ్చితి, గందరగోళం నెలకొన్నట్లు అధికార యూపీఏ ప్రతినిధి బృందం గవర్నర్‌కు సమర్పించిన లేఖలో తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన హేమంత్‌ సర్కార్‌ను అక్రమ పద్ధతిలో అస్థిరపరిచే చర్యలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. హేమంత్‌ శాసనసభ్యత్వంపై అనర్హత వేటువేసినా కూటమికి తగినంత మెజార్టీ ఉందని, ఆ ప్రభావం ప్రభుత్వంపై ఉండదని స్పష్టం చేసింది.

సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైంది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష భాజపా.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. అందుకు అనుగుణంగా ఈసీ తన అభిప్రాయాన్ని ఆగస్టు 25న సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. హేమంత్ సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news