టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించింది. విజయదశమి పర్వదినాన దిల్లీ, ముంబయి, కోల్ కతా, వారణాసి నగరాల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను జియో అందుబాటులోకి తెచ్చి వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 5జీ అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను అందిస్తోంది.
4 నగరాల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్‌ను ఇస్తోంది. కస్టమర్లకు మెసేజ్ ద్వారా ఇన్వైట్‌ను పంపి ఈ ఆఫర్‌ను అందిస్తోంది. 5జీ వెల్‌కమ్ ఆఫర్ ఇన్వైట్ అందుకున్న కస్టమర్లు.. ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏకంగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో ప్రకటించింది
దేశంలో 5జీ సర్వీస్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం లాంఛ్ చేశారు. దేశంలోని 8 నగరాల్లో 5జీ సర్వీస్‌లను తొలి దశలో తీసుకొస్తున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇప్పుడు జియో కూడా 4 నగరాల్లో 5జీ సర్వీస్‌లను ట్రయల్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది.