న్యూ ఇయర్ స్పెషల్ : ఖాతాదారులకు జియో బంపర్ ఆఫర్

-

మరో నాలుగు రోజుల్లోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ కొత్త సంవత్సరం నేపథ్యంలో చాలా కంపెనీలు.. చాలా రకాల ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించుకుంటాయి. ముఖ్యంగా సెల్ఫోన్ కంపెనీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కంపెనీలు ఇలా చాలా రకాల కంపెనీలు.. కొత్త సంవత్సరం సందర్భంగా చాలా రకాల ఆఫర్ను ప్రకటిస్తూ ఉంటాయి. 50% డిస్కౌంట్ లాంటి ఆఫర్లను కూడా ప్రకటిస్థాయి. ఈ నేపథ్యంలోనే.. నూతన సంవత్సరం సందర్భంగా రిలయన్స్‌ జియో యూజర్లకు కొత్త ఆఫర్‌ ప్రకటించింది.

రూపాయలు 2 వేల 545 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 336 రోజులే కాగా.. ఆఫర్‌ కింద 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. జనవరి 2 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. ప్రస్తుత యూజర్లతో పాటు, కొత్తగా జియో సిమ్‌ తీసుకున్న వారికి సైతం ఈ ప్లాన్‌ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news