గుండు చేసుకోమని కోహ్లికి సవాలు విసిరిన వార్నర్..

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బారి నుంచి ప్రజలను కాపాడానికి వైద్యులు వారి ప్రాణాలకు తెగించి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సామాన్యుల నుంచి మొదలుకుని దేశాధినేతల వరకు ఈ కష్టకాలంలో వారు అందిస్తున్న సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తాజాగా వైద్య సిబ్బందికి మద్దతుగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్వయంగా గుండు చేసుకున్నాడు.

తను స్వయంగా గుండు చేసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్నర్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులకు మద్దతు తెలపడం కోసమే ఇలా చేశానని చెప్పారు. షేవ్ యూవర్ హెడ్ చేసుకోవాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌తోపాటు మరికొందరని నామినేట్ చేశాడు. అయితే వార్నర్ చాలెంజ్‌పై కోహ్లి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరోవైపు ఆస్ట్రేలియాలో కరోనా మృతుల సంఖ్య 19కి చేరింది. 4 వేలకు పైగా కరోనా పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయని అక్కడి వార్తసంస్థలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news