టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫైబర్ సర్వీస్‌కు గాను నూతనంగా ట్రూలీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్లను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లలో అప్‌డోల్ స్పీడ్ ఎంత వస్తుందో, డౌన్ లోడ్ స్పీడ్ కూడా అంతే వస్తుంది. ఇవి నెలకు రూ.399 నుంచి ప్రారంభమవుతాయి. ఇక 30 రోజుల పాటు 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో జియో ఫైబర్ సేవలను ఉచితంగా ట్రై చేయవచ్చు. అలాగే 4కె సెట్ టాప్ బాక్స్‌లో ఉచితంగా 10 ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
జియో ఫైబర్ రూ.399, రూ.699, రూ.999, రూ.1499 ల పేరిట నూతన ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లతో వరుసగా 30, 100, 150, 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఉచితంగా వాయిస్ కాల్స్ లభిస్తాయి. రూ.999 ప్లాన్‌తో రూ.1వేయి విలువ గల 11 ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు. అలాగే రూ.1499 ప్లాన్‌లో రూ.1500 విలువ గల 12 ఓటీటీ యాప్స్‌కు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు.
రూ.999, రూ.1499 ప్లాన్లలో ఇచ్చే ఓటీటీ యాప్స్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, వూట్, ఆల్ట్ బాలాజీ, సన్ నెక్ట్స్ తదితర యాప్స్ ఉన్నాయి. వీటిని వాడినందుకు అదనంగా ఎలాంటి చార్జిలను చెల్లించాల్సిన పనిలేదు.
ఇక జియో ఫైబర్ సేవలను కొత్త కస్టమర్లు 30 రోజుల పాటు ఉచితంగా ట్రై చేయవచ్చు. ఆ సమయంలో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఇస్తారు. 150 ఎంబీపీఎస్ స్పీడ్ వస్తుంది. దీంతోపాటు 4కె సెట్ టాప్ బాక్స్‌ను 10 పెయిడ్ ఓటీటీ యాప్స్ తో ఎలాంటి అదనపు చార్జిలు లేకుండా వాడుకోవచ్చు. ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. 30 రోజుల అనంతరం సర్వీస్ నచ్చకపోతే ఆపేయవచ్చు. లేదా నచ్చితే డబ్బులు చెల్లించి ఏదైనా ప్లాన్‌ను తీసుకుని సర్వీస్‌ను కొనసాగించవచ్చు. కొత్త జియో ఫైబర్ కస్టమర్లకు సెప్టెంబర్ 1 నుంచి 30 రోజుల ఉచిత ట్రయల్ ఆఫర్‌ను అందిస్తారు. ఇక కొత్తగా కనెక్షన్ తీసుకునేవారికి మై జియో యాప్‌లో వోచర్లు లభిస్తాయి. అలాగే ఇప్పటికే జియో ఫైబర్‌ను వాడుతున్న కస్టమర్లు పైన తెలిపిన ప్లాన్లకు అప్‌గ్రేడ్ కావచ్చని ఆ సంస్థ తెలియజేసింది.