బెయిల్పై విడుదలైన మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగెటివ్ వచ్చింది..తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో అచ్చెన్నకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అచ్చెన్నను ఆస్పత్రి నుంచి ఇవాళో రేపో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు, టెలీ సర్వీసెస్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఈ ఏడాది జూన్12న ఉదయం 7:20 గంటలకు అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. 2014-2019 మధ్య ఈఎస్‌ఐ ఆసుపత్రులకు రూ.988.77 కోట్లు కొనుగోలులో రూ.150కోట్లు అవినీతి జరిగినట్లు అనిశా అభియోగం మోపింది.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి నేరుగా విజయవాడకు తీసుకెళ్లారు. అర్థరాత్రి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అప్పటికే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకుని ఉండటం.. వందల కిలోమీటర్లు దూరం కారులో ప్రయాణించటంతో రక్తస్రావం జరిగింది. దీనిపై కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి వివరించటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు.అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం పడుతుందని.. ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులను అరెస్ట్ చేయాలని ఈ తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.