తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యాయత్నం కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఓ సంచలనంగా మారింది. నిన్న రాత్రి సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు కొన్ని విషయాలను వెల్లడించిన విషయం తెలిసినదే. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న రాత్రి ఢిల్లీలోని నివాసం నుంచి తన కిడ్నాప్‌నకు కొంతమంది గూండాలు యత్నించారని.. ఇవాళ మహబూబ్ నగర్‌లోని నివాసంపై దాడికి పాల్పడ్డారని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. ఈ దాడిలో తన కారు ధ్వంసం అయిందని… ఇల్లు తగుల బెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని జింతెందర్‌రెడ్డి ట్వీట్ చేశారు. మహబూబ్‌నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.సీపీ స్టీఫెన్ రవీంద్ర స్క్రిప్ట్ చదివారు. నేను మున్నూరు రవికి అకామిడేషన్ ఇచ్చాను. షెల్టర్ ఇవ్వలేదని చెప్పాడు. తెలంగాణ ఉద్యమకారుడు, మళ్లీ కూడా అకామిడేషన్ ఇస్తానని చెప్పాడు. నా పీఏను కాంటాక్ట్ అయ్యాడు. మున్నూరు రవి మొదటి సారి ఉండలేదు. ఇంతకు ముందు కూడా ఉన్నాడు. రవి నాదగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు అని వెల్లడించారు. అసలు నా డ్రైవర్, పీఏ రాజు ఏమి తప్పు చేశారని.. శ్రీనివాస్ గౌడ్‌ను ఎందుకు మర్డర్ చేయాలనుకుంటారని జితెందర్‌రెడ్డి ప్రశ్నించారు.