వైసీపీ మాత్రం నష్టపోయిన రైతుల విషయమై ఏనాడు ఓ సర్వే చేయించడం కానీ వారితో మాట్లాడడం కానీ చేయలేదు. ఆ రోజు ప్రభుత్వం భూమి తీసుకున్నందుకు పరిహారం కొంత అంతేకాకుండా భూమికి బదులు భూమి (రాజధాని నిర్మాణంలో భాగంగా ప్లాట్ల రూపంలో కానీ కమర్షియల్ కాంప్లెక్సుల రూపంలో కానీ అభివృద్ధి చేసిన భూమి) ఇవ్వాలని నిర్ణయించింది.ఆ విధంగా పూలింగ్ అన్నది సులువుగానే ముగిసిపోయింది.పెద్దగా ఆర్థిక భారం లేకుండానే ప్రభుత్వం తాను అనుకున్న విధంగా రాజధాని నిర్మాణానికి భూములు సేకరించింది. తరువాత వచ్చిన వైసీపీ ఇవన్నీ మరిచిపోయి కొంత ప్రతిష్టంభన నెలకొనే విధంగా 3 రాజధానుల డ్రామా నడిపింది.ఆఖరికి ఇవాళ హైకోర్టు తీర్పు వచ్చింది.
దాని ప్రకారం…
రాజధాని అవసరాలకు తప్ప
ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదు : హైకోర్టు
ఇది చాలా అంటే చాలాముఖ్యమయిన విషయం.ఇప్పటిదాకా ప్రభుత్వం చేసిన తప్పిదాల్లో ఇది కూడా ఒకటి.సరిగా ఆదాయం లేని కారణంతో రాజధాని భూములను ఇష్టం వచ్చిన విధంగా తాకట్టు పెట్టాలని,తద్వారాఅప్పులు తేవాలని పరితపించారు.ఆవిధంగా కొన్ని ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యాయి.ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేసిన రాజధాని భూములను కొన్ని రియల్ వెంచర్లుగామార్చి అమ్మేందుకు కూడా జగన్ సర్కారు ప్రయత్నాలు చేసింది.కొన్నింటిని బ్యాంకులలో తనఖా పెట్టేందుకు ఉన్న అన్ని దారులనూ న్యాయ పర ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.ఆ విధంగా దీన్నొక ఆర్థిక వనరుగా చూసింది.