శత్రువైనా చేరదీసిన ఉక్రెయిన్ మహిళలు… తల్లితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయిన రష్యా సైనికుడు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఎనిమిది రోజుల నుంచి ఉక్రెయిన్ స్వాధీనానికి రష్య బలగాలు ప్రయత్నిస్తుంటే… వారిని అంతే స్థాయిలో ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్త మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎంతటి సైనికుడైనా.. మాతృత్వానికి బానిసే అని మరోసారి నిరూపితం అయింది. దీనికి తోడు తమ శత్రువైనా ఉక్రెయిన్ మహిళలు ఆదరించిన తీరుతో ఆ రష్యా సైనికులు చలించిపోయాడు.

బందీగా దొరికిన రష్యా సైనికుడికి తినడానికి ఆహారం, టీ అందించారు. రష్యన్ ఆర్మీకి ఆ దేశం సరైన ఆహార పదార్థాలను కూడా అందించలేకపోయింది. దీంతో చాలా మంది రష్యన్ సైనికులు తమకు ఇష్టం లేకున్నా యుద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలో ఒక లొంగిపోయిన సైనికుడికి స్థానికంగా ఉన్న ఉక్రెయిన్ మహిళలు తినడానికి ఆహారాన్ని అందించారు. అంతే కాకుండా అతని తల్లితో సెల్ ఫోన్ లో మాట్లాడించారు. దీంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యాడు. భావోద్వేగాన్ని ఆపుకోలేక  తన తల్లికి ముద్దు పెట్టి వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. పట్టుబడిన సమయంలో కొంత మంది ఉక్రెయిన్లు ఇది వీరి తప్పుకాదు.. వీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో వీరికే తెలియదు అనే మాటలు వినిస్తాయి. 

ఈ వీడియోను ఓ ఉక్రెయిన్ పౌరుడు ట్విట్టర్ లో షేర్ చేశాడు. అందులో రష్యా సైనికులారా.. లొంగిపోండి. మీకు ఉక్రెయిన్ పౌరులు ఆహారం ఇస్తారంటూ.. కామెంట్ చేశాడు. పట్టుబడిన రష్యా సైనికులకు ఎలాంటి అపాయం చేయబోమని మా యుద్ధం వారితో కాదని, బందీలుగా పట్టుకున్న రష్య సైనికులను వారి తల్లులకు అప్పగిస్తామని.. మేము ఉక్రెయిన్లం అని, పుతిల్ లా ఫాసిస్టుగా వ్యవహరించమని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ అంది.

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో జరుగుతున్న మారనహోమానికి రష్యన్ సైనికులు చలించిపోతున్నారు. సివిలియన్లను టార్గెట్ చేస్తుండటంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ఆపడానికి కొంత మంది సైనికులు సొంత వాహనాలనే ధ్వంసం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు ఓ సైనికుడు తన తల్లితో మాట్లాడుతూ… ఇక్కడ నిజమైన యుద్ధం జరుగుతోంది… వారు మమ్మల్ని, ఆ వాహనాలకు అడ్డుగా నిలుచుని, వాటిా చక్రాల కింద పడుతూ.. ఆహ్వానిస్తున్నారని ఎమోషనల్ అయ్యాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news