JOBS : ఆటోక్యాడ్​​తో అద్భుతమైన ఉద్యోగాలు

-

ఏ వస్తువునైనా తయారు చేసేటప్పుడు డిజైనింగ్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా భవనాలు నిర్మించేటప్పుడు డిజైనింగ్ చాలా ప్రాముఖ్యం. కేవలం పేపర్ మీద డిజైన్ చేస్తే కొన్ని లోపాలు కలుగుతాయి. అందుకే కంప్యూటర్​లో 2డీ, 3డీ రూపాల్లో డిజైన్లు చేస్తుంటారు. ఇవి చాలా ప్రభావంతంగా ఉంటాయి. మన ఆలోచనలను కరెక్ట్​గా ప్రతిబింబిస్తాయి కూడా. మరి ఈ డిజైనింగ్ ఎలా చేయాలి అంటే.. ఆటో క్యాడ్ అనే అప్లికేషన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి మీరు డిజైన్ చేయాలనుకున్నదాన్ని ఈజీగా ఎఫెక్టివ్​గా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆటోక్యాడింగ్​ డిజైనింగ్ నేర్చుకున్నవారికి ఎన్నో ఉపాధి అవకాశాలున్నాయి. మరి అవేంటో తెలుసుకోండి.

jobs
jobs

 

క్యాడ్‌ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌) రెండు మూడు డైమన్షన్స్‌లో నమూనాలు గీసేందుకు ఉపయోగించే ఒక డిజిటల్‌ టెక్నాలజీ. దేన్నయినా తయారుచేసే ముందు దాని డిజైన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు క్యాడ్‌ ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ డిజైనర్లు… ఇలా చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు. డిజిటల్‌ డిజైన్స్‌ రంగంలో ఆటోక్యాడ్‌ నిపుణుల అవసరం ఎంతో ఉంది.

ప్రస్తుతం టెక్నికల్‌ ప్రాజెక్టులు, డ్రాయింగ్స్‌ కోసం వాడుతున్న సాఫ్ట్‌వేర్లలో ఆటోక్యాడ్‌ ముందు వరసలో ఉంది. ఆర్కిటెక్చర్‌ ప్లానింగ్‌లో లేఅవుట్లు వేసేందుకు, మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు ఉత్పత్తుల 3డీ ప్రింటింగ్‌ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌, జ్యూవలరీ డిజైన్స్‌ తయారీలోనూ ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది.

ఆటోక్యాడ్‌లో విభిన్నమైన వెర్షన్స్‌ ఉన్నాయి. ఎల్‌టీ, ఎంఈపీ, పీ అండ్‌ ఐడీ, సివిల్‌, మ్యాప్‌ త్రీడీ లాంటి రకాలను విభిన్న మార్కెట్‌ అవసరాలకు తగినట్టుగా అభివృద్ధి చేశారు.

ఆటోక్యాడ్‌ నేర్చుకునేందుకు కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్లలో కోర్సులు ఉన్నాయి. ప్రైవేట్‌లో అయితే చాలా ఇన్‌స్టిట్యూట్లు దీన్ని నేర్పిస్తున్నాయి. కోర్సెరా, యుడెమీ, స్కిల్‌షేర్‌ లాంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్‌లోనూ నేర్చుకునే అవకాశం ఉంది. ఆటోడెస్క్‌ డిజైన్‌ అకాడెమీలోనూ దీన్ని ఎలా నేర్చుకోవాలనే అంశంపై మెటీరియల్‌ దొరుకుతుంది. సంస్థను బట్టి 3 వారాల నుంచి రెండేళ్లకు పైబడి కోర్సు కాలవ్యవధి ఉంటుంది. సర్టిఫికేషన్‌ అనంతరం ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

ఆటోక్యాడ్‌ సాఫ్ట్‌వేర్‌లో విభిన్నరకాలైన టూల్స్‌, కమాండ్స్‌ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే మనందరి కంప్యూటర్లలోనూ ఉండే పెయింట్‌ అప్లికేషన్‌ బాగా ప్రొఫెషనల్‌గా ఉంటే ఎలా కనిపిస్తుందో… అలా ఉంటుంది. కచ్చితమైన కొలతలతో నచ్చిన డ్రాయింగ్స్‌ను సులభంగా వేసేలా ఇన్‌బిల్ట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. ఈ ట్రైనింగ్‌ పొందినవారు ధ్రువపత్రం కోసం పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఉన్న వారికి విభిన్న అవకాశాలు లభిస్తున్నాయి.

సర్టిఫికేషన్‌ పరీక్షలో డైమన్షనింగ్‌, మాడిఫైయింగ్‌, హాచింగ్‌, కమెంటరీస్‌, ప్రింటింగ్‌, ప్లాటింగ్‌ వంటి టెక్నిక్స్‌ ఎలా ఉపయోగిస్తున్నారో పరీక్షిస్తారు. అందువల్ల వీటిపై పట్టు సాధించడం తప్పనిసరి. ఇందులో ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్స్‌ వస్తూ ఉండటం వల్ల మనం కూడా నూతన నైపుణ్యాలు అధ్యయనం చేయడంపై దృష్టి సారించాలి.

ఆటోక్యాడ్​పై ఉద్యోగాలు.. ఆటోక్యాడ్‌పై పట్టు సాధించాక ఆటోక్యాడ్‌ స్పెషలిస్ట్‌, మెంటర్‌, ఫ్రీలాన్సర్‌గా పనిచేసే అవకాశం ఉంది. డిజైన్‌ మేకింగ్‌తో సొంత సంస్థను నెలకొల్పి క్లైంట్లకు సేవలు అందించవచ్చు. ఆటోక్యాడ్‌ డిజైన్స్‌ను అమ్మకానికి పెట్టే ఆన్‌లైన్‌ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటికి మోడల్స్‌ను అందించవచ్చు. హౌస్‌ డిజైనింగ్‌లోనూ రాణించే అవకాశం ఉంటుంది. చాలామంది తమ ఇళ్లను ప్రత్యేకంగా, కొత్తగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. ఫ్లోర్‌ ప్లాన్స్‌, బ్లూప్రింట్స్‌ తయారీలో ఆటోక్యాడ్‌ డిజైన్స్‌ తయారీ అవసరమవుతుంది. ఏవైనా రియల్‌ ఎస్టేట్‌ ఫర్మ్స్‌తో జోడీ కట్టడం ద్వారా మీ క్యాడ్‌ వర్క్స్‌ మార్కెట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటోక్యాడ్‌ డిజైనర్‌గానూ అవకాశాలు అందుకోవచ్చు. సర్వేయింగ్‌, మ్యాపింగ్‌ సర్వీసెస్‌లో స్కెచెస్‌ చేసి ఇవ్వొచ్చు. ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంపెనీలు, పేరుమోసిన జ్యూవలరీ సంస్థల్లో కొలువుదీరొచ్చు

Read more RELATED
Recommended to you

Latest news