మండల కార్యాలయాలలో ఉద్యోగాలు… పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. TSPSC తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ వివిధ విభాగాలలో ఖాళీగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోచ్చు. ఏదైనా డిగ్రీ, బీటెక్ లేదా బీఈ పాసైన వారు అప్లై చేయవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఎంపిడిఓ, డిఎస్పీ, టాక్స్ అసిస్టెంట్ మరియు తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. స్త్రీ, పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. వయస్సు విషయానికి వస్తే 31, 44 ఏళ్ల వయస్సు మించరాదు.

దరఖాస్తు చివరి తేదీ మే 31, 2022. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. దరఖాస్తు ప్రక్రియ మే 02, 2022 నుండి మొదలు అవ్వనుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష ఫీజు గురించి చూస్తే.. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులు కి రూ. 320 మరియు మిగితా అభ్యర్ధులు రూ. 200.

ఖాళీల వివరాలు:

మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ( ఎంపీడీఓ ) – 121
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ( డీఎస్పీ ) – 91
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు – 48
డిప్యూటీ కలెక్టర్లు – 42
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు – 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు – 38
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు – 26
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు – 20
అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ లేబర్ – 08
డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్లు – 06
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు – 05
డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్లు – 05
డిస్ట్రిక్ రిజిస్ట్రార్ ( రిజిస్ట్రేషన్ ) – 05
రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు – 04
డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు – 03
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు – 02
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ – 02
డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆపీసర్లు – 02

నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1JmA_qcYOdx81Xy_YJ9DzYgteihQ3QixA/view

 

Read more RELATED
Recommended to you

Latest news