నేను ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడుతా – మంత్రి మల్లారెడ్డి

-

నేను ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడుతానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలమైందని.. కరోనా వల్ల నిర్మాతలకు డబ్బులు తక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. కానీ కార్మికులు బాగా నష్టపోయారని… సినిమా కార్మికులంతా ఇప్పుడు అదృష్టవంతులు అని చెప్పారు.

40 ఏళ్ల కిందట నేను జేమ్స్ బాండ్ సినిమాలు చూసేవాణ్ణి అని… నాలుగేళ్లకోసారి ఒక్క జేమ్స్ బాండ్ సినిమా వచ్చేదని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.. సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని అని చెప్పారు. చిరంజీవిది ఆంధ్రా కాదు… తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లేనన్నారు.

కాబోయే నిర్మాతలు, ఓటీటీ ఓనర్లు ఇక నుంచి కార్మికులేనని… నా లాంటి వాళ్లను భాగస్వాములను చేసి ఓటీటీ లు పెట్టుకోవాలని కోరారు. సైకిల్ మీద పాలమ్ముకున్న నేను ఈ రోజు కార్మిక శాఖ మంత్రినయ్యానని.. కార్మికుల కోసం చిరంజీవి సినిమాలు తీయాలి, ఓటీటీలు పెట్టాలని పేర్కొన్నారు.
కార్మికుల పక్షాన చిరంజీవి నిలబడాలని.. సినీ కార్మికులకు ధనవంతులను చేసే బాధ్యతను చిరంజీవి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news