కైలాసదేశంలో జాబ్స్ ..నిత్యానంద స్వామి పేరుతో జోరుగా సాగుతున్న ప్రచారం..

-

నిత్యానంద స్వామి అంటే తెలియని వాళ్లు ఉండరు.. ఆయన వివాదాస్పద వాక్యలు..రాసలీలల వ్యవహారంతో సోషల్‌ మీడియోలో పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు హోరెత్తిస్తున్నాయి. అదేంటి ఆధ్యాత్మికవేత్త ఉద్యోగాలు ఎలా కల్పిస్తారనే సందేహాలకు తావులేకుండా పూర్తి డిటెయిల్స్ కూడా సోషల్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదంతా నిత్యానందస్వామి చేయించారా లేక ఆయన శిష్యులు చేయించారా లేక.. మరెవరైనా ఆయనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారా అనే చర్చ విస్తృతంగా ఇప్పుడు నడస్తుంది.

కైలాసదేశంలో జాబ్స్ ..

కైలాసదేశంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన నోటిఫికేషన్. భారతదేశంలోని నిత్యానందస్వామికి చెందిన విశ్వవిద్యాలయాలు, కైలాస ఆలయాలు, ఐటీ విభాగాలతో పాటు రాయబార కార్యాలయాల్లో పోస్టులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. అంతే కాదు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఏడాది పాటు జీతం ఇచ్చి ట్రైనింగ్ ఇస్తారట. ట్రైనింగ్‌లో నైపుణ్యం సాధించి ఉద్యోగానికి అర్హత పొందితే కైలాసదేశంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నిత్యానందస్వామి పేరుతో కొందరు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.
నిత్యానందస్వామి అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అఢుగుపెట్టిన తర్వాత నిత్యానందం, పరమశివం, పరమహంస, అనే పేర్లతో పిలబడుతూ వచ్చారు. ఆ మధ్య కాలంలో నిత్యానందస్వామి ఆరోగ్యం బాగోలేదని శ్రీలంకలో చికిత్స చేయించుకునేందుకు అక్కడి ప్రభుత్వాన్ని శిష్యులు పర్మిషన్ కోరడం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాల ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరి నిజంగా నిత్యానందస్వామికి కైలాసదేశం ఉందా..ఉంటే ఎంత మందికి ఉద్యోగ అకాశాలు కల్పిస్తారు..? ఎలా అప్లై చేసుకోవాలి..? జీతం ఎంత ఇస్తారు..? సందేహాల్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారానే వక్తపరుస్తున్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా..అప్లై చేసి బోర్లా పడొద్దు.. చాలామంది..ఈ ప్రచారాన్ని లైట్‌ తీసుకోవడం లేదు. వారి అత్యత్సాహం చూస్తుంటే..కచ్చితంగా అప్లై చేసి ఎక్కడ ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా అనిపించింది..! మీరేమంటారు.. నిజంగా నిత్యానంద స్వామికి కైలాసదేశం ఉందంటారా..?

Read more RELATED
Recommended to you

Latest news