Samantha Father: ఆ విష‌యం తెలియగానే నా మైండ్ బ్లాక్ .. స‌మంత తండ్రి ఎమోష‌న‌ల్

-

Samantha Father: టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంత. కానీ వీర‌ద్ద‌రూ విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అక్టోబ‌ర్ 2న తామిద్ద‌రం విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి ఇండ‌స్ట్రీలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేశారు సామ్ చైతూలు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని, భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు.

తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కూడా స్పందించారు. సామ్ చైతూల విడాకుల గురించి తెలియగానే ముందుకు తనకి ఏమీ తోచలేదు. ఒక్క‌సారిగా మైండ్ బ్లాక్ అయింది. సమంత స్పృహలో ఉండే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని పరిస్థితులు సద్దుమణుగుతాయని ఆశిస్తున్నట్టుగా వెల్లడించారు జోసెఫ్ ప్రభు. కాగా సమంత తండ్రికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తుంది.

త‌మ వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టి.. ఇకపై స్నేహితులుగా కొనసాగుదామ‌ని భావిస్తున్నాం.. మేం మా జీవితాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీని మాకు ఇవ్వండి అని సోషల్ మీడియా వేదికగా తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే

Read more RELATED
Recommended to you

Latest news