Breaking : కంగనా పొలిటికల్‌ ఎంట్రీ.. స్పందించిన జేపీ నడ్డా

-

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. రాజకీయాల్లో రావడానికి ఆసక్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కంగనా. బీజేపీలో చేరడానికి ఇష్టపడుతున్నట్లు కూడా వెల్లడించింది. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ను పార్టీలోకి స్వాగతిస్తామని వెల్లడించారు. అయితే, పార్టీ టికెట్ ఇచ్చే విషయం ఇప్పుడే చెప్పలేమని వివరించారు జేపీ నడ్డా. బీజేపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఈ సందర్భంగా కామెంట్ చేశారు జేపీ నడ్డా. పార్టీ టికెట్ ఇవ్వడం తన ఒక్కడి చేతిలో లేదని, అంతర్గతంగా చర్చించి ఎవరికి టికెట్ ఇవ్వాలో పార్టీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయిస్తామని జేపీ నడ్డా తెలిపారు.

BJP welcomes Kangana Ranaut, BUT...': JP Nadda REACTS after the actress  expresses her desire to contest election | India News | Zee News

స్థానిక కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వాటిపై చర్చించాకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందని జేపీ నడ్డా వివరించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, అక్కడ పార్టీ టికెట్ల కేటాయింపుపై ఇప్పుడే మాట్లాడలేమని వెల్లడించారు జేపీ నడ్డా. రాజకీయాల్లోకి రావడంపై కంగనా రనౌత్ శనివారం స్పష్టత ఇచ్చారు. బీజేపీ టికెట్ ఇస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్పందించారు. పార్టీలో చేరాలనుకుంటే కంగాన రనౌత్ కు స్వాగతం పలుకుతామని జేపీ నడ్డా తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news