ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి తీసుకురావాలని చాలా మంది పార్టీలో ఉన్న సీనియర్లు బాబుపై ఒత్తిడి తీసుకొస్తున్న ఈ సంగతి అందరికీ తెలిసినదే. జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా పార్టీ బాగుపడుతుంది మళ్లీ ఫామ్ లోకి వస్తుందని బాబుకి సూచిస్తున్నారు. గతంలో 2009 ఎన్నికల టైములో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం బాధ్యతలు తీసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీకి దూరం అవడం జరిగింది.ఆ సందర్భంలో కావాలని చంద్రబాబు… జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేయడం జరిగిందని వార్తలు కూడా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే తన కొడుకు నారా లోకేష్ కి రాజకీయ జీవితం ఉండదు అనే ఆలోచనతో చంద్రబాబు ఈ పని చేసినట్లు అనేక ఆరోపణలు రావడం జరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిణామాలను బట్టి పార్టీ పరిస్థితి బట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వాలని టిడిపి కార్యకర్తలు కూడా కామెంట్ చేస్తున్నారు.
దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచనలో పడింది. మరోపక్క టిడిపిలో ఉన్న సీనియర్లు మాత్రం చంద్రబాబు ఒప్పుకోకపోయినా ఎన్నికల ప్రచారం సమయంలో బ్యాక్ డోర్ నుంచి టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే విధంగా వ్యూహాలు వేస్తున్నట్లు టిడిపి పార్టీలో టాక్.