ఇన్‌స్టాలో మా కూతురి వీడియోలు తొలగించండి : గ్యాంగ్ రేప్ బాధితురాలి తల్లిదండ్రులు

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగాన్ని ఆశ్రయించారు. బాలిక వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవలే గమనించిన తల్లిదండ్రులు ఆ విషయాన్ని మహిళా భద్రతా విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మహిళా భద్రతా విభాగం అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు సూచించారు.

మే 28వ తేదీన మైనర్ బాలికపై సాదుద్దీన్‌తో పాటు నలుగురు మైనర్ బాలురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు జూన్ 2వ తేదీన ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసుకొని పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. ఫేస్‌బుక్‌ మాధ్యమానికి బాలిక వీడియోలు తొలగించాలని నోటీసులిచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇటీవల బాలిక వీడియోలు ఉన్నట్లు తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న రెండు వీడియోలతో పాటు…. ఆమె మెడపై గాయం ఉన్న ఫోటో సైతం ఇన్ స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేసిన వాళ్ల ఐపీ అడ్రస్ కోసం సైబర్ క్రైం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news