విడాకుల విషయమై అనిల్ కపూర్, వరుణ్ ధావన్ మధ్య చర్చ..వెరీ ఫన్నీగా ‘జగ్ జగ్ జీయో’ ట్రైలర్

-

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వాణీ జంటగా నటించిన చిత్రం ‘జగ్ జగ్ జీయో’. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో సీనియర్ హీరో అనిల్ కపూర్, నీతుకపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మేకర్స్ పిక్చర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కు చక్కటి స్పందన లభిస్తోంది. వెరీ ఫన్నీ వేలో డిఫరెంట్ విషయాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. భార్యా భర్తల మధ్య డైవోర్స్ ఎప్పుడు వస్తుంది? ఒకే సమయంలో తండ్రీ, కొడుకులు ఇద్దరూ డైవోర్స్ ఇవ్వాలని అనుకున్న క్రమంలో ఏం జరుగుతుంది? అనే విషయాలు ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు.

ఇక ట్రైలర్ మొత్తం నవ్వులు పూయించేలా ఉండగా, సినిమా ఇంకా ఫన్నీగా ఉంటుందని అర్థమవుతోంది. ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ ఫిల్మ్ ను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ప్రొడ్యూస్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news