మునుగోడులో పోలీసులపై ఫైర్‌ అయిన కేఏ పాల్‌

తెలంగాణలో ఎక్కడ చూసిన మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. అయితే.. మునుగోడు ఎన్నికల బరిలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన పట్ల ఒక పోలీసు అధికారి అనుచితంగా వ్యవహరించారంటూ ఆయనపై మండిపడ్డారు కేఏ పాల్. నాపై మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తావా? అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు. మిగిలిన పోలీసులంతా తనతో గౌరవంగా ఉన్నారని… నీవు మాత్రం గౌరవం లేకుండా ఎలా వ్యవహరిస్తున్నావని ఓ పోలీసు అధికారిపై కేఏ పాల్ మండిపడ్డారు.

KA Paul: బీకేర్‌ఫుల్‌.. ఐయామ్‌ డాక్టర్‌ కేఏ పాల్‌.. పోలీసులపై మండిపాటు

‘నువ్వు ఆఫ్ట్రాల్ ఒక ఎస్సైవో, సీఐవో… అయాం డాక్టర్ కేఏ పాల్… బీ కేర్ ఫుల్’ అంటూ కేఏ పాల్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ గా పని చేస్తున్నావా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా తన పట్ల చాలా గౌరవంగా ఉంటారని కేఏ పాల్ చెప్పారు. తాను శాంతిదూతనని రేవంత్ చెప్పారని… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న తనతో ఎంత బాగా వ్యవహరించారో చూడలేదా? అని అడిగారు కేఏ పాల్.