100 కోట్ల హిట్ ఇచ్చినా సినిమా లేదా..!!

-

ఉప్పెన సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు  దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతో రూ. 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు. కాని సినిమా రిలీజ్ అయ్యి 20 నెలలు గడిచినా కొత్త ప్రాజెక్ట్ సెట్ కాలేదు. కాని హీరోయిన్, హీరో మాత్రం 3 సినిమాల పైనే చేసేశారు. కాని వీళ్ల కెరియర్ కూడా గొప్పగా లేదు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత బుచ్చిబాబు స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ కథ ను ఎన్టీఆర్ కు చెప్పాడట.కొన్ని లోపాలు వుండడం  వల్ల జూ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయినా పట్టుదలతో కొన్ని మార్పులు చేసి  ఫైనల్ గా పూర్తి స్క్రిప్ట్ ని  యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వినిపించాడట. స్క్రిప్ట్ సూపర్ గా ఉండి నచ్చడంతో ఫైనల్ గా ఎన్టీఆర్  బుచ్చిబాబు ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలో ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తన 30వ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. తర్వాత బుచ్చిబాబు సినిమా వుండే అవకాశం ఉందని అంటున్నారు.

ఒకవేళ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా ముందు మొదలు పెడితే బుచ్చి బాబు మళ్లీ ఎవరైనా యంగ్ హీరో ని వెతుక్కోవాల్సి వుంటుంది. అలా అయితే బుచ్చి బాబు పరిస్థితి దారుణం గా వుంటుంది. ఒక వేళ తనదే నెక్స్ట్ సినిమా అయితే మాత్రం తను లక్కేనే. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ హీరోలకు చిన్న డైరెక్టర్స్ కు అవకాశం ఇచ్చే పరిస్థితి వుండదు. వారికి చాలా కమిట్ మెంట్లు వుంటాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news