ఇది మొదటి అడుగే: MLA కడియం శ్రీహరి

-

తెలంగాణ నదీ జలాల మీద కేంద్రం పెత్తనానికి దాసోహం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నేడు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకి పార్టీ బృందం వెళ్ళింది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుండి చలో నల్గొండ బహిరంగ సభకి పార్టీ ఎంపీలు తో పాటుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులు కూడా వెళ్లారు. కడియం శ్రీహరి మీడియాని ఉద్దేశించి మాట్లాడారు ఈ రోజు పార్టీ ప్రజాప్రతినిధుల్ని సీనియర్ నాయకుల్ని అంతా నల్గొండ బహిరంగ సభకి బయలుదేరి వెళుతున్నామని చెప్పారు.

- Advertisement -

గత పది ఏళ్లుగా అడ్డుకున్నది తమ పార్టీ ప్రభుత్వమే అని అన్నారు నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం రెండు నెలల్లో కృష్ణ గోదావరి నదీ జలాల బోర్డులకి నదుల నిర్వహణని అప్పజెప్పిందని అన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకి భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడుచుకుందని అన్నారు. నిన్న అసెంబ్లీలో అబద్దాలని ప్రచారం చేస్తుందని అన్నారు నేడు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...