Kajal Agarwal: తల్లి కాబోతున్న విషయం కాజల్‌కు అలా తెలిసిందట..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాతృత్వపు అనుభూతులను పదిల పరుచుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో రెస్ట్ తీసుకుంటున్న అందాల చందమామ..తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా టచ్ లోనే ఉంటున్నది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తోంది. బేబీ బంప్ తో మెటర్నిటి షూట్ లో పాల్గొన్న పంచదార బొమ్మ..తాజాగా ఓ కమర్షియల్ యాడ్ చేసింది.

సదరు యాడ్ ప్రెగ్నెన్సీ సంస్థది కావడం విశేషం. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్రగ్నెంట్ గా ఉండటం యాడ్ కు ఇంకా అడ్వాంటేజ్ అయింది. సదరు టీవీ యాడ్ ప్రెగా న్యూస్ సంస్థది. ఈ యాడ్ ను కాజల్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ప్రెగాన్యూస్ ద్వారా కచ్చితమైన నిర్ధారణతో తాను కేవలం ఐదు నిమిషాల్లో తన శుభవార్తను తెలుసుకున్నానని, లక్షలాది మంది భారతీయ మహిళలచే విశ్వసించబడినదని, ఇది బ్రాండ్ మాత్రమే కాదు, భారతదేశపు నెం.1 ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్ అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

భారతీయ మహిళలు ఇక వేచి ఉండొద్దని, ఈరోజే నిపుణుడిని ఇంటికి తీసుకురావాలని కాజల్ అగర్వాల్ పేర్కొంది. కాగా, కాజల్ అగర్వాల్ ఇటువంటి యాడ్ చేయడం పట్ల నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాయనుకూలమైన యాడ్ చేసి కాజల్ అగర్వాల్ ఒకరకంగా ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని అంటున్నారు. కాజల్ అగర్వాల్ నటించిన టాలీవుడ్ మెగాస్టార్ ‘ఆచార్య’ ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news