నారా లోకేష్ పై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు. నారా లోకేష్ హరిత విప్లవ పితామహుడా?? వ్యవసాయ రంగ నిపుణుడా ? అని నిలదీశారు. చంద్రబాబు కొడుకు అయినంత మాత్రాన ఏది పడితే అది అడిగితే సమాధానం చెప్పటం నాకే ఇబ్బందికరంగా ఉందని ఎద్దేవా చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
రైతు, కౌలు రైతులు అంటే ఏంటో లోకేష్ కు తెలుసా? అని నిలదీశారు. అసని తుఫాను కు సంబంధించి అంచనాలు వేయమని అధికారులకు ఆదేశించామన్నారు. ప్రాధమికంగా ఆరు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండు, మూడు రోజుల్లో పూర్తి అంచనాలు వస్తాయని.. ఈ సీజన్ ముగియటాని కంటే ముందే రైతులకు నష్ట పరిహారం అంద జేస్తామని ప్రకటించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతులకు అనేక సేవలు, కార్యక్రమాలను మా ప్రభుత్వం చేపడుతోందని వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతు రథం పేరుతో కార్యక్రమాన్ని జూన్ 6న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారని ప్రకటన చేశారు.