BREAKING : కార్పోరేటర్ భర్త పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

-

BREAKING : కార్పోరేటర్ భర్త పై చేయి చేసుకున్నాడు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. అంబర్ పేట్ లో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం ముదిరింది. అంబర్‌ పేట్‌ పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్ మధ్య వ్యాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు…గొడవకు దిగారు.

పూలే విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఎమ్మెల్యే… నాపై దాడి చేశాడని కార్పొరేటర్ దూసరి లావణ్య ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే గత కొంత కాలం నుండి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదంటూ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేసింది. మా డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో మమ్ముల్ని అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news