కోవిడ్ 19 : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక వీటిని పాటించండి…!!

-

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మేరకు వార్తలు కూడా వస్తున్నాయి ఈ సమయంలో మనం ఆరోగ్యకరమైన చిట్కాలని పాటించాలి. అలానే ఊపిరితిత్తుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఆదివారం అప్డేట్ చేసిన దాని ప్రకారం 5000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విషయాలను అసలు మర్చిపోకూడదు. చాలా మంది ధూమపానం చేస్తూ ఉంటారు. నిజానికి స్మోకింగ్ వలన ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

 

స్మోకింగ్ చేయడం వలన ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలుగుతుంది. రెస్పిరేటరీ కి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటూ ఉండాలి కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లు దూరంగా ఉండటం మంచిది. అలానే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. వారానికి ఐదు రోజులు వ్యాయామం చేసిన సరే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోవడం వలన ఆరోగ్యంగా ఉండచ్చు. పండ్లు కూరగాయలు వంటివి డైట్ లో తీసుకుంటూ ఉండండి దాంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

సమస్యలు కూడా ఉండవు. షుగర్ ఎక్కువ ఉండేవి, ఫ్యాట్ ఎక్కువగా ఉండేవి అసలు తీసుకోవద్దు. ఊపిరితిత్తులు ఆరోగ్యం కోసం బ్రీతింగ్ టెక్నిక్స్ ని కూడా ఫాలో అవ్వండి. ఇవి కూడా మీ యొక్క ఊపిరితిత్తులని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎయిర్ పొల్యూషన్ లేకుండా చూసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించండి ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉంటాయి. ఏ సమస్య లేకుండా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news