“కాళేశ్వరం ప్రాజెక్ట్” మరో ఘనత.. ఇక పాఠశాల పుస్తకంల్లోకి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత…. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. 2019 ఇది సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు… ఇంకా కొనసాగుతూనే ఉంది. భూపాలపల్లి కాళేశ్వరం లోని గోదావరి నదిపై ఈ బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 13 జిల్లాల ద్వారా సుమారు 500 కిలోమీటర్ల దూరం వరకు 28 ప్యాకేజీలుగా విభజించి బడింది. ఇది ఇలా ఉండగా తాజాగా తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్తు తరాల విద్యార్థుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి వివరించేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతుంది. కాలేశ్వరం పేరుతో 4వ తరగతి తెలుగు పుస్తకం లో ఈ పాఠ్యాంశాన్ని పొందు పరచనుంది విద్యాశాఖ. ఇందులో కాళేశ్వరం ఆలయంతో పాటు ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించారు. అలాగే 4 మరియు 9 తరగతుల్లో తెలుగు ను తప్పనిసరిగా అమలు చేయాలన్నా ప్రభుత్వ ఆదేశం తో ఉచిత తెలుగు వాచకాలు రూపొందించారు.