తెలంగాణ కల సాకారం – కాళేశ్వరం

-

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన డిమాండు – నీళ్లు. ఆ కల నేడు సాకారమైంది. తెలంగాణ బీళ్లపై తనివితీరా పారడానికి గోదారిగంగమ్మ పరవళ్లు తొక్కుతూ పరిగెత్తుకొస్తోంది. నాటి ఉద్యమ సారథి, నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆహర్నిశలు శ్రమించి, తాను స్వయంగా ఇంజనీర్‌ అవతారమెత్తి రూపుదిద్దిన తెలంగాణ వరప్రదాయిని, కాళేశ్వరం ప్రాజెక్టు నేడు ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ప్రారంభించబడింది. తెలంగాణలోని 70శాతం భూములకు నీళ్లందించబోయే ఈ ప్రాజెక్టుతో తెలంగాణ వ్యవసాయ, ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని వివరాలు క్లుప్తంగా…. మీ కోసం..

      • గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా, వార్దా, మానేరు 5 బేసిన్ల నుంచి వరద నీరు మేడిగడ్డ కు చేరుతుంది.
      • మేడిగడ్డ వద్ద అత్యధికంగా 284.3 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది.
      • అత్యాధునిక లైడార్ సర్వే ను పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ను రీడిజైన్ తో మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
      • కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు 2016 మే 2న మేడిగడ్డ వద్ద సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
      • 80వేల 500 కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టును మూడేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు చేసి ప్రధాన పనులన్నీ పూర్తి చేశారు.
      • కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టారు.
      • ఈ ప్రాజెక్టులో 19 పంప్ హౌస్ లు, 20 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల పొడవునా కాలువలు, 98 కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహ గొట్టాలు ఏర్పాటు చేశారు.
      • మొత్తం 19 పంప్ హౌస్ లో 82 మోటార్లు ఏర్పాటు.
      • మేడిగడ్డ ఆరంభ స్థలం నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు 500 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసేలాప్రాజెక్టును రూపకల్పన చేశారు.

    • 16.37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు.
    • బ్యారేజీ పొడవు పొడవు 1632 మీటర్లు.
    • అందులో స్పిల్ వే 1308 మీటర్లు.
    • బే పొడవు 324 మీటర్లు.
    • మెడిగడ్డ బ్యారేజ్ కి 85 గేట్లు ఏర్పాటు.
    • మేడిగడ్డ బ్యారేజీ ని 28 లక్షల 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించారు.
    • మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ కన్నేపల్లి వరకు నిలువ ఉంటాయి.
    • కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద 40 మెగావాట్ల సామర్థ్యం గల 11 భారీ మోటర్లు ఏర్పాటు చేశారు.
    • 11 మోటర్లు రోజుకు రెండు టీఎంసీల నీటిని 49 మీటర్ల ఎత్తుకు ఎత్తు వస్తాయి.
    • కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్ చేస్తే గ్రావిటీ కెనాల్ ద్వారా మేడిగడ్డకు 22 కిలో మీటర్ల దూరంలోని అన్నారం బ్యారేజ్ కి చేరుతుంది.
    • అన్నారం బ్యారేజీ ని గోదావరి నదిపై 10.87 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు.
    • దానికి 66 గేట్లు ఏర్పాటు చేశారు.
    • అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ మంథని మండలం గుంజపడుగు వరకు ఉంటుంది.
    • గుంజపడుగు వద్ద అన్నారం పంపుహౌస్ ఏర్పాటు చేశారు.
    • అన్నారం పంప్ హౌస్ వద్ద 40 మెగావాట్ల సామర్థ్యం గల 8 భారీ మోటర్లు ఏర్పాటు చేశారు.
    • 8 మోటార్లను ఆన్ చేస్తే 34 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తుంది.
    • అలా ఎత్తి పోసిన నీళ్లు గ్రావిటీ కాలువ ద్వారా సుందిళ్ల బ్యారేజీ కి చేరుతుంది.
    • 8.83 టీఎంసీల నీటి సామర్థ్యం తో సుందిళ్ల బ్యారేజీ ని గోదావరి నదిపై నిర్మించారు.

  • సుందిళ్ల బ్యారేజీ కి 74 గేట్లు ఏర్పాటు, సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ గోలివాడ వరకు ఉంటుంది.
  • గోలివాడ వద్ద సుందిళ్ల పంప్ హౌస్ ఏర్పాటు చేశారు.
  • అక్కడ 40 మెగావాట్ల సామర్థ్యం గల 9 మోటర్లు ఏర్పాటు.
  • 9 మోటర్లు ఆన్ చేస్తే 40 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడంతో ఆనీరు శ్రీపాద ఎల్లంపల్లికి ప్రాజెక్టు కు చేరుతుంది.
  • శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ను వేంనూరు వద్ద 3గేట్లను ఎత్తి రెండు భారీ సొరంగ మార్గాల ద్వారా నందిమేడారం రిజర్వాయర్, సర్జిపూల్ కు తరలిస్తారు.
  • నందిమేడారం పంప్ హౌస్ వద్ద 124 మెగావాట్ల సామర్థ్యం గల 7 మోటర్లు ఏర్పాటు చేశారు.
  • అక్కడి 7 మోటర్లు ఆన్ చేస్తే 1.95 కిలోమీటర్ల దూరం కాలువ ద్వారా, 15.37 కిలోమీటర్ల దూరం రెండు సొరంగ మార్గాల ద్వారా నీరు ప్రవహించి లక్ష్మీపూర్ సర్జిపూల్ ట్యాంకు చేరుతుంది.
  • లక్ష్మీపూర్ పంప్ హౌజ్ వద్ద 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 మోటర్లు ఏర్పాటు చేశారు.
  • ఏడు మోటర్లు 117 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తి పోస్తే ఆ నీళ్లు వరద కాలువ లో పడుతుంది.
  • అక్కడ నుంచి ఒక టిఎంసి నీళ్లు మిడ్ మానేరు కు, మరో టిఎంసి నీరు వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీ పునఃరుజ్జీవన పథకం కింద శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది.
  • మిడ్ మానేర్ కు చేరుకున్న నీరు అనంతగిరి అక్కడి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ చెరువు వరకు వెళుతుంది.
  • గొలుసుకట్టుగా ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 1581గ్రామాల పరిధిలోని
  • 18 లక్షల 25 వేల ఏడు వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.
  • గ్రేటర్ హైదరాబాద్ తో పాటు 13 జిల్లాల పరిధిలోని గ్రామాలకు తాగునీరు సప్లై చేస్తుంది.
  • ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టును అద్భుతంగా రూపకల్పన చేసి మూడేళ్లలో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news