కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సచివాలయంలో పీసీ ఘోష్ నివేదిక పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అధిక వడ్డీలకు రూ.84 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అధిక వడ్డీకి ఎన్బీహెచ్సీల దగ్గర లోన్లు తెచ్చారు. డిజైన్, ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ.. మేడిగడ్డ బ్యారెజీలో చాలా లోపాలున్నట్టు NDSA గుర్తించింది. తాము అధికారంలోకి రాకముందే మేడిగడ్డ కుంగిపోయింది.
తొలుత రూ.38వేల కోట్లతో 16లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయి. రుణాలు తీసుకువచ్చే విషయంలో అవకతవకలు జరిగాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కమిషన్ వేశామని గుర్తు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు పీసీ ఘోష్ నివేదిక స్పష్టం చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్ట్ పునాదుల్లోనే లోపాలున్నాయి. కేంద్రమంత్రి ఉమా భారతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి 205 టీఎంసీలు ఉంటే.. నీళ్లు ఉన్నాయో లేదో అక్కడ మరోసారి చెక్ చేయమని రాసింది అని ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.