ప్రతిపక్ష నేతలకు భద్రత కుధిస్తూ సీఎం జగన్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని అన్నారు టిడిపి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపునకు పోలీసులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారని ఆరోపించారు.మా పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గన్ మెన్లను ఉన్న ఫలంగా తొలగించారని,
పెగాసస్, ఫోన్ టాపింగ్ పై మాట్లాడిన మరుసటి రోజే గన్ మెన్లను ఉపసంహరించడం కక్ష సాధింపేనని అన్నారు.
ప్రతిపక్ష నేతలకు భద్రత కుదిస్తే.. ప్రత్యర్థులకు ప్రభుత్వం అవకాశం ఇస్తోందా? అంటూ ప్రశ్నించారు.జిల్లా లో గన్ మెన్లను కేటాయించిన వారి జీబితాను ఎస్పీ సమీక్షించాలని కోరారు.కొంతమంది ప్రమాదకర, సమాజానికి హానికర వ్యక్తులకు భద్రత కల్పించారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో పదేళ్లు నాలాంటి వాళ్లకు భద్రత ఉండేదని, వైసీపీ అధికారంలోకి రాగానే తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సాక్షాత్తూ పీఏసీ ఛైర్మన్ స్థాయి వ్యక్తి కి ఈ పరిస్థితి వస్తే ఎలా?అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గన్ మెన్ల ఉపసంహరణ విషయంలో ఎందుకు నిబంధనలు పాటించలేదని అన్నారు.
రిలీవర్ రాక ముందే గన్ మెన్లను వెనక్కి పిలవడం లో అంతర్యం ఏంటి? అంటూ ప్రశ్నించారు.2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిటాల రవీంద్ర ను ఏ విధంగా వేధించారో చూశామని అన్నారు.గన్ మెన్లను మార్చి పరిటాల రవీంద్ర ను వేధించి ఆయన చావుకు పరోక్షంగా పోలీసు వ్యవస్థ కారణం అయిందని అన్నారు.ప్రత్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అధికార పార్టీ నెతలకు చేరవేయడం పోలీసు వ్యవస్థ మానుకోవాలని సూచించారు.