టీడీపీలో వైసీపీ కోవర్టు..ఈ శిరీష ఎవరు?

-

రాజకీయాల్లో సాధారణంగానే కోవర్టులు ఉంటారు….వేరే పార్టీ కోసం పనిచేస్తూ…ఉన్న పార్టీకి దెబ్బ వేస్తారు. ఇది మొదట నుంచి రాజకీయాల్లో జరుగుతున్న ప్రక్రియే. అయితే కోవర్టులని పార్టీ అధిష్టానాలు గమనించి పక్కనబెట్టాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టి‌డి‌పి ఆ పని చేయడం లేదని, సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. తాజాగా టి‌డి‌పిలో మహిళలకు సంబంధించి పదవుల పంపకాలు జరిగాయి.

ysrcpandtdp
ysrcpandtdp

ఈ క్రమంలోనే టి‌డి‌పి రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా కంభంపాటి శిరీషని నియమించారు. అయితే ఈ శిరీష వైసీపీ కోవర్టు అని చెప్పి అమరావతికి చెందిన టి‌డి‌పి నేతలు విమర్శిస్తున్నారు. 2019లో ఎన్నికల్లో వైసీపీ గెలిచిన వెంటనే ఆమె జగన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిందని చెబుతూనే, అమరావతిని ధ్వంసం చేసే వారిపై తాము పోరాటం చేస్తుంటే,  అమరావతికి ద్రోహం చేసే వారికి ఉన్నత పదవులు ఇవ్వటంపై అధిష్టానం ఆలోచన చేయాలని టి‌డి‌పి నేతలు కోరారు.

అయితే ఆమె టి‌డి‌పిలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టి‌డి‌పి నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా శిరీషపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. టి‌డి‌పి సోషల్ మీడియా విభాగాల్లో…శిరీ…జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న ఫోటోలు కూడా హల్చల్ చేశాయి. అలాగే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌తో శిరీష ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టారు. శిరీష వైసీపీ మనిషి అని టి‌డి‌పి నుంచి బయటకు పంపాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

ఇదే క్రమంలో కొందరు టి‌డి‌పి నేతలు బయటకొచ్చి మరీ శిరీషపై విమర్శలకు దిగారు. అయితే ఇలాంటి అంశాల్లో టి‌డి‌పి సీరియస్‌గా ఉండాల్సిన అవసరముంది అని కొందరు తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు. కోవర్టులని అసలు ఎంకరేజ్ చేయడకూడని అంటున్నారు. మరి చూడాలి శిరీష విషయంలో టి‌డి‌పి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news