ఏపీ బీజేపీలో క‌మ్మ‌లు వ‌ర్సెస్ కాపులు

-

ఏపీలో రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ?  ఏ కులానికి అనుకూలంగా ట‌ర్న్ అవుతాయో కూడా ఊహించ‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన కులాలుగా క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాలు ఉన్నాయి. ఇక కాపులు ఇప్ప‌టికే రెండు, మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేసినా అవేవి స‌క్సెస్ కాలేదు. ప్ర‌జారాజ్యంతో చిరు అధికారంలోకి రావాల‌ని అనుకున్నా.. జ‌న‌సేన‌తో ప‌వ‌న్ సీఎం అవ్వాల‌ని క‌ల‌లు క‌న్నా అవేవి స‌క్సెస్ కాలేదు. ఏదేమైనా ప్ర‌ధాన రాజ‌కీయం అంతా ఈ మూడు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారి చేతుల్లోనే ఉంద‌నేది వాస్త‌వం. ప్ర‌ధానంగా ఈ మూడు సామాజిక వ‌ర్గాల్లో క‌మ్మ‌లు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకే వెన్నుద‌న్నుగా ఉంటూ వ‌స్తున్నారు.

ఇక రెడ్లు ముందు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి వ‌న్‌సైడ్‌గా స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌డు కాపు సామాజిక వ‌ర్గం వారు గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ఉండ‌గా.. ఆ త‌ర్వాత జ‌న‌సేన‌కు స‌పోర్ట్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో కాపులు అంద‌రూ మెజార్టీ జ‌న‌సేన లేదా వైసీపీకే స‌పోర్ట్ చేశారే త‌ప్పా టీడీపీకి మాత్రం స‌పోర్ట్ చేయ‌లేదు. ఇక ఇప్పుడు రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిన కాపు వ‌ర్గాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. సంఖ్యా ప‌రంగా ఎక్కువుగా ఉన్న కాపుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలో కొద్ది రోజులుగా బీజేపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. అందుకే కాపు వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌తో పొత్తు పెట్టుకోవ‌డం… ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇచ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా వ‌చ్చిన సోము వీర్రాజు వీళ్లంతా కాపులే.

బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం కాపుల‌కు ప్ర‌యార్టీ ఇస్తుండ‌డంతో పాటు తాజాగా సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వ‌డంతో బీజేపీలో ఉన్న క‌మ్మ‌లంతా గుస్సాగా ఉన్నారు. వెంక‌య్య నాయుడు ఉన్నప్ప‌టి నుంచి గ‌త ఐదేళ్ల వ‌ర‌కు కూడా ఏపీ బీజేపీలోనే క‌మ్మ‌ల‌దే ఆధిప‌త్యం ఉంది. ఇప్పుడు వీరి హ‌వాకు గండి ప‌డుతోంది. తాజాగా వీర్రాజు ప్ర‌మాణ స్వీకారానికి కామినేని శ్రీనివాస్ మాజీ ఎంపీ హరిబాబు మరియు సుజనాచౌదరి లాంటి బీజేపీ కీలక నేతలు ముఖం చాటేశారు. సోముకు గ్రౌండ్ లెవ‌ల్లో బ‌లం లేక‌పోవ‌డంతో ఆయ‌న చేసేదేం లేద‌ని కూడా వీళ్లంతా గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌. మ‌రి బీజేపీలో క‌మ్మ వ‌ర్సెస్ కాపు వార్ ఎంత వ‌ర‌కు వెళుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news