జయలలిత బయోపిక్.. కంగనా షాకింగ్ కామెంట్స్.. ఆ సినిమా వల్ల నాకు.!

-

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించడమే కాదు తన కాంట్రవర్సీలతో సోషల్ మీడియాని ఎప్పుడూ ఊపేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తలైవి అనే టైటిల్తో ఏఎల్ విజయ్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో కంగనా కు సంబంధించిన లుక్స్ ఇప్పటికే విడుదలై మంచి ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాత్రలో జయలలితను మరిపించడానికి ఎంతో డెడికేషన్ తో పని చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు కంగనా రనౌత్. సినిమాలో పాత్ర కోసం ఏకంగా 20 కేజీల వరకు బరువు పెరుగింది. ఇక అంతలా బరువు పెరిగి ఆ తర్వాత భరతనాట్యం కూడా చేయడంతో తన వెన్నుముక దెబ్బతిన్నదని అంటూ ఇటీవల కాలంలో చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా సమయం పట్టింది అంటూ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news