ఇవాళ్టి నుంచే కంటి వెలుగు..55 లక్షల కంటి అద్దాల పంపిణీ

-

ఇవాళ్టి నుంచే తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 16533 సెంటర్లలో ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నివారింపదగిన అంధత్వాన్ని లేకుండా చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1500 టీములు సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఈ కార్యక్రమం చేస్తాయని..రిక్వెస్ట్ పెడితే మీ కాలనీ వద్దకే కంటి వెలుగు బృందం వస్తుందని వివరించారు.

ఒక బృందం రోజుకు 120 నుంచి 130 మందిని పరీక్షిస్తుందని..హైకోర్టు ప్రెస్క్లబ్లో వద్ద కంటి వెలుగు కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. జిల్లాలో మీ కాలనీలో కంటి వెలుగు కార్యక్రమం కావాలంటే డిఎంహెచ్వో గాని కలెక్టర్ గాని రిక్వెస్ట్ పెట్టండని..55 లక్షల కంటి అద్దాలను ఇవ్వబోతున్నామని ప్రకటించారు హరీష్‌ రావు. కంటి అద్దాలన్నియూ ఈ సారి మేడిన్ తెలంగాణ అని తెలిపారు. ఒకప్పుడు బెంగాల్ ఏం చేస్తే దేశం అది చేస్తుందని విదంగా ఉండేది ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అది చేస్తుంది అనే విధంగా మారిందని పేర్కొన్నారు హరీష్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news