డబ్బులు డ్రా చేసుకోవాలా..? అయితే ఏటీఎంకు వెళ్లకుండానే ఇంట్లో వుండే..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే తాజాగా కొత్త కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది స్టేట్ బ్యాంక్. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. మనం ఈ మధ్య కాలం లో ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నాం. అయితే ఒక్కో సారి క్యాష్ కూడా అవసరం అవుతూ ఉంటుంది.

అలాంటప్పుడు చుట్టు పక్కల ఏటీఎంలు లేవంటే ఇబ్బంది పడాలి. ఆ సమయం లో ఇంట్లో కూర్చుని డబ్బులని పొందొచ్చు. ఇంట్లో కూర్చుని డోర్‌స్టెప్‌ సర్వీసు ద్వారా డబ్బులని పొందేందుకు అవుతుంది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సర్వీస్ సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని డబ్బును ఈజీ విత్‌డ్రా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఈ సర్వీస్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ సదుపాయాన్ని పొందేందుకు కస్టమర్‌లపై కొన్ని ఛార్జీలు విధిస్తోంది బ్యాంకు. వికలాంగులకు నెలలో మూడు ట్రాన్సక్షన్స్ ని ఉచితంగా చేసింది. మూడు సార్లు కంటే ఎక్కువసార్లు అయితే ఆయా సేవలకు రూ.75, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ డోర్‌స్టెప్ సేవ కోసం మీరు ముందు నమోదు చేసుకోవాలి.
అలానే మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని నమోదు చేయండి.
పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్ (పిన్) ఎంటర్ చెయ్యాలి.
డీఎస్‌బీ యాప్ నుండి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.
మీరు యాప్‌కి లాగిన్ చేయవచ్చు.
మీ చిరునామాను కూడా ఇక్కడ ఎంటర్ చేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news