Karan Johar: సర్‌ప్రైజ్ ఇచ్చిన కరణ్ జోహార్..OTTలో ‘కాఫీ విత్ కరణ్’ షో..

-

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’షో ఇక ఉండబోదని అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం తెలుసుకుని అందరూ నిజమే అనుకున్నారు. కానీ, తాజాగా మరో ట్వీట్ చేసి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు కరణ్ జోహార్. ‘‘కాఫీ విత్ కరణ్’’ షో ఇక టీవీలో ఉండబోదని, OTTలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు.

సెలబ్రిటీలను తన దైన శైలిలో ప్రశ్నించే ‘కాఫీ విత్ కరణ్’ షో ఇక ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంటుందని స్పష్టం చేశారు కరణ్. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా, ఏడో షో ఓటీటీలో ఉంటుందని వివరించారు. ఈ ఓటీటీలో త్వరలో షో స్ట్రీమ్ అవుతుందని చెప్పారు కరణ్ జోహార్.

ఈ మేరకు కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా అనౌన్స్ మెంట్ చేయగా, అది చూసి నెటిజన్లు సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు. క్రికెటర్లు, సెలబ్రిటీల పేర్లు కామెంట్స్ చేసి వారిని ఈ షోకు తీసుకురావాలని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ ఏడో సీజన్ లో తొలి పార్టిసిపెంట్ గా ఏ సెలబ్రిటీ వస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news