కరీంనగర్ టు చైనా.. గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడి ప్రకటన

-

ఇటీవల హైదరాబాద్, కరీంనగర్ లలో గ్రానైట్ కంపెనీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఆయన సోదరులు, టిఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి గ్రానైట్ కంపెనీలలో కూడా అధికారులు సోదాలు చేశారు. వీరితో పాటు పరువు గ్రానైట్ కంపెనీలలో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9 గ్రానైట్ కంపెనీలకు సంబంధించిన యజమానులకు ఈడి అధికారులు నోటీసులు ఇచ్చారు.

తాజాగా గ్రానైట్ కంపెనీలలో సోదాలపై ఈడి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాలలో రూ 1.80 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ ప్రకటించింది. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లుగా ఈడి తెలిపింది. అక్రమంగా విదేశాలకు గ్రానైట్ తరలించినట్లుగా గుర్తించింది ఈడి. కరీంనగర్ నుండి హాంకాంగ్, చైనా వంటి దేశాలకు సముద్ర, రైల్వే మార్గాల ద్వారా అక్రమంగా గ్రానైట్ రవాణా చేసినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి రావలసిన రూ. 750 కోట్లను గ్రానైట్ కంపెనీలు ఎగ్గొట్టినట్లు గుర్తించారు. గ్రానైట్ వ్యాపారుల బినామీల పేర్ల మీద అకౌంట్లో ఉన్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news