ప్రధాని మోదీని అడ్డుకుంటే సీఎం కేసీఆర్ ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్. ప్రధాని మోదీ, గవర్నర్ బీసీలు అయినందువల్లే వాళ్ళని అవమానిస్తున్నారని మండిపడ్డారు. మోడీ బీసీ కాబట్టే కేసీఆర్ ధర అహంకారంతో అడ్డుకోవాలని అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆత్మబలిదానాలు బీసీల పాలు అయితే భోగాలు కెసిఆర్ కుటుంబం పాలు అయ్యాయని ఆరోపించారు. అన్ని రంగాల్లో బీసీ లను ఈ ప్రభుత్వం చిదిమి వేసిందన్నారు. మోడీ బీసీ వ్యతిరేకి అనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు లో హామీ ఇచ్చి గొల్ల కురుమలను వంచించారని విమర్శించారు. చేనేత మీద gst తెలంగాణ తో పాటు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటేనే వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో మాత్రమే 20 లక్షలు దాటితే gst వసూలు చేస్తుందన్నారు. GST లో 2.5 శాతం రాష్ట్ర ప్రభుత్వం కి వస్తుంది కదా ఎందుకు రీ ఇంబర్స్ ఇవ్వరు? అని ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్ నుండి సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఐటీ దాడులు జరిగిన మంత్రి బీసీ మంత్రి… ఎందుకు బీసీ ల కు న్యాయం చేయలేదన్నారు.