కరీంనగర్ లో వివి ఫ్యాట్ తరలింపు కలకలం రేగింది. ఒక వాహనం నుండి మరో వాహనం లోకి వివి ప్యాట్ తరలింపు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. రోడ్డుపై వివి ప్యాడ్ తరలించిన వ్యక్తిని బిజెపి శ్రేణులు నిలదీశారు. కాగా సోషల్ మీడియాలో వీడియోలను..సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పని చేయని వివి ప్యాట్ ను అఫీషియల్ వాహనం నుండి మరొక అఫీషియల్ వాహనంలో తరలించారన్నారు.
రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి ఈమేరకు ప్రకటన విడుదల విడుదల చేశారు. అది ఉప ఎన్నికలకు ముందు పనిచేయని వివి ప్యాట్ అని….ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డు ఎదురుగా నుండి ఒక అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనం లో గోదాం కు తీసుకు వెళ్తున్నామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ దృశ్యాలను అనుమానంతో ఒకరు వీడియో తీసి వైరల్ చేశారని.. అది నిజం కాదని ఆయన స్పష్టం చేశారు.