నాదగ్గరకు వచ్చేదాకే సమస్య.. తరువాత సమాధానం.. కార్తికేయ 2 ట్రైలర్‌

-

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్‌ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలనే ఉన్నాయి. ఇప్పటికే కార్తికేయ సినిమాను చూసిన వారితో పాటు కార్తికేయ-2 టీజర్ చూసిన వాళ్లు సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్‌ అవుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు. అయితే.. ద్వాపరయుగంతో .. ద్వారాకా నగరంతో ముడిపడిన కథ ఇది. అభిషేక్ అగర్వాల్ – విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనుపమ్ ఖేర్ కీలకమైన పాత్రను పోషించాడు.

Karthikeya 2 (Telugu) Theatrical Trailer Nikhil, Anupama Parameshwaran, Anupam Kher | Zee Cinemalu - YouTube

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో ఏదో రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుండటం .. అందుకు కొందరు అడ్డుపడుతుండటం ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ కార్యాన్ని సాధించడానికి తనని శ్రీకృష్ణుడు ఎంచుకున్నాడని భావించిన హీరో అవాంతరాలను ఎదుర్కుంటూ ఉంటాడు. నా దగ్గరకు వచ్చేదాకే సమస్య.. నా దగ్గరకు వచ్చాక సమాధానం అంటూ సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే.. సముద్రతీరంలో .. మంచు పర్వతాలలో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో ఆదిత్య మీనన్ .. తులసి .. శ్రీనివాస రెడ్డి కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news