పేదరికం చదువుకు అడ్డం కాకూడదు : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల  ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని, ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని అన్నారు. తెలంగాణలో ఐదు సొసైటీల ద్వారా 985 గురుకుల పాఠశాలలలో సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు కొప్పుల ఈశ్వర్.

Minister Koppula Eshwar - Great Telangaana

అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అభినందించి, శుభాభినందనలు తెలిపారు కొప్పుల ఈశ్వర్. తెలంగాణలో నడుస్తున్న గురుకులాలను దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కొనియాడుతున్నారని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న, చదువుతో పాటు క్రీడలు,  ఇతర రంగాల్లో కూడా గొప్పగా రాణిస్తున్న ఈ పాఠశాలలు మనందరికీ గర్వ కారణమన్నారు కొప్పుల ఈశ్వర్. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని కొప్పుల ఈశ్వర్ అభినందించారు.