ప్రేమకు అంగీకరించింది కానీ.. పెళ్లి చేసుకోవాలని అడిగితే మాత్రం ససేమిరా అంది. దీంతో ప్రియురాలు చేసిన మోసానికి తనువు చాలించాడు ఓ యువకుడు. తానే ప్రాణం అని అనుకుని లక్షల్లో ఖర్చు పెట్టాడు. ఆమె సరదాల కోసం తన జీతంలో చాలా భాగాన్ని ఖర్చు చేశాడు. అయితే పెళ్లికి మాత్రం నిరాకరించింది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా తన లవర్ కు పెట్టిన ఖర్చు మొత్తాన్ని తన కుటుంబానికి ఇప్పించాల్సిందిగా కోరుతూ ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూర్ జిల్లా శంకరపుర లో జరిగింది.
చేతన్ అనే యువకుడు ఓ అమ్మాయితో 9 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ప్రేమించుకున్నంత కాలం ప్రేయసి కోసం చాలానే ఖర్చు చేశాడు. ఆమె సరదాలు, సంతోషాల కోసం దాదాపుగా 4.5 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. సాధారణ సరుకు రవాణా డ్రైవర్ గా ఉన్న చేతన్ తన సంపాదనలో చాలా వరకు తన ప్రియురాలి కోసమే ఖర్చు చేశారు. అయితే ప్రేయసి మాత్రం పెళ్లి అనే సరికి మాట దాటేసేది. ఆమె ప్రవర్తనతో విసుకుచెందిన చేతన్ సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న చోట ఓ లేఖలో తన లవర్ కోసం రూ. 4.5 లక్షలు ఖర్చు పెట్టానని.. ఆ డబ్బులు తన కుటుంబానికి ఇప్పించాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.